సమ్మె విరమించి తక్షణమే చర్చలకు వెళ్లండి  హైకోర్టు

  హైదరాబాద్: సమ్మె విరమించి తక్షణమే చర్చలకు వెళ్లాలని హైకోర్టు ఆర్టీసీ కార్మికులకు సూచించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమ్మె విరమించాలని ఆదేశించిందిపండుగలు, పాఠశాలల సమయంలో సమ్మె చేయడ ఎంతవరకు సమంజసం అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనలకు అనేక పద్ధతులు ఉన్నాయి కదా అని యూనియన్లను నిలదీసింది. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చా. చట్టాన్ని ఉల్లంఘించవచ్చా. ఎస్మా ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని ఆర్టీసీ యూనియన్లను హైకోర్టు ప్రశ్నించిందిసమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే పరిస్థితేంటని అడిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీని విలీనం చేస్తే మిగితా కార్పోరేషన్లు డిమాండ్ చేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. 75శాతం బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో మిగితావి పునరుద్ధరిస్తామని వివరించింది. చర్చల ద్వారా సమస్యైనా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.