గంగూలీకి వెల్లువెత్తుతున్న అభినందనలు..

  బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీకి సహచర, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. బ్యాటింగ్ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. గంగూలీ నాయకత్వంలో భారత క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని లక్ష్మణ్ అన్నాడు. కొత్త పాత్రలో అతడు విజయవంతం కావాలని వీవీఎస్ ఆకాంక్షించాడు. దీనికి సౌరభ్ స్పందిస్తూ.. థాంక్యూ వీవీఎస్.. నీ సహకారం ఎంతో ముఖ్యమైనది. అని రి?ప్లై ఇచ్చాడు. దాదాకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత క్రికెట్ కు ఇది శుభసూచకమని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అక్టోబర్ 23న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో దాదా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు దాదాకు కంగ్రాట్స్ చెప్పారు.