ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక.. రూ. లక్ష జరిమానా

వారం రోజుల్లో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. లేదంటే హోటల్‌కు తాళం వేస్తామని వార్నింగ్ ఇచ్చారు


చికెన్ బిర్యానీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్యారడైజ్..! హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోనే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్..! ఐతే ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుకలు రావడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్‌లో బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయని ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో హెల్త్ అధికారి, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటేషన్ అధికారి రంగంలోకి దిగి హోటల్‌లో తనిఖీలు చేశారు. కిచెన్‌‌లో అపరిశుభ్రత, వంట సామాగ్రిలో నాణ్యాత లేకపోవడం వంటి కారణాలతో రూ. లక్ష జరిమానాతో పాటు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. లేదంటే హోటల్‌కు తాళం వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.