తెలంగాణలో ప్లాస్టిక్ బ్యాన్..

 


సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో దీన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.తెలంగాణలో సింగల్ యూజ్ (ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌)ను బ్యాన్ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. 'తెలంగాణలో సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై తీర్మానం చేస్తారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇది అమలవుతుంది. దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికుల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్నా' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దిశగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. తెలంగాణలో కూడా ప్లాస్టిక్ బ్యాన్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.